రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడి కీలక సలహా
టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఆస్ట్రేలియా(Australia) మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్(Matthew Hayden) కీలక సలహా ఇచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఆస్ట్రేలియా(Australia) మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్(Matthew Hayden) కీలక సలహా ఇచ్చారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border–Gavaskar Trophy)లో దూకుడును చూపించాలని కోరారు. ‘రోహిత్ అంటే చాలా స్వేచ్ఛగా ఆడే ఆటగాడు. కానీ ఈ సిరీస్‌లో ఆయన బ్యాటింగ్ చాలా నీరసంగా ఉంటోంది. అలాంటి ప్లేయర్ బాల్‌ను డిఫెన్స్ ఆడాలని చూడకూడదు. తన సహజమైన ఆటను ఆడాలి. సోదరా.. మరింత దూకుడును చూపించండి’ అని హెడెన్ కోరారు. ఇదిలా ఉండగా.. గబ్బా టెస్టు(Gabba Test)లో ఆసీస్ బౌలర్లతోపాటు భారత బ్యాటర్లను వరుణుడు కూడా విసిగించాడు. వర్షం కారణంగా ఇవాళ 33 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. అందులోనూ టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లను ఎదుర్కొని 51/4 స్కోరుతో నిలిచింది. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (33*), కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 394 పరుగులు వెనకబడి ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.