భారత క్రికెట్‌కు అంకిత్ వీడ్కోలు

ఉత్తరప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అంకిత్ రాజ్‌పుత్ సోమవారం భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Update: 2024-12-16 18:49 GMT

దిశ, స్పోర్ట్స్ : ఉత్తరప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అంకిత్ రాజ్‌పుత్ సోమవారం భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, వ్యాపార కోణంలో వరల్డ్ క్రికెట్‌లో కొత్త అవకాశాలను అన్వేషిస్తానని చెప్పాడు. తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.ఇటీవల రంజీ ట్రోఫీలో చివరిసారిగా యూపీకి ఆడాడు. రెండు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 2012-13 రంజీ సీజన్‌లో అంకిత్ అరంగేట్రం చేశాడు. 80 ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 248 వికెట్లు, 50 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 71 వికెట్లు, 87 టీ20ల్లో 105 వికెట్లు తీశాడు. దేశవాళీలో సత్తాచాటినప్పటికీ అంకిత్ జాతీయ జట్టులో దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో చెన్నయ్, పంజాబ్, రాజస్థాన్, లక్నో జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌లో భాగమైనప్పటికీ ఆడే అవకాశం రాలేదు. 31 ఏళ్ల అంకిత్ ఐపీఎల్‌లో 29 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీశాడు. ఇటీవల వేలంలో అతన్ని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.



Similar News