టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుందనే నమ్మకం లేదు : Yuvraj Singh

భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలుస్తుందనే నమ్మకం తనకు లేదని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు.

Update: 2023-07-11 12:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలుస్తుందనే నమ్మకం తనకు లేదని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. భారత జట్టు మిడిలార్డర్ చాలా బలహీనంగా ఉందని, కీలక ఆటగాళ్లంతా గాయాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

'నిజాయితీగా చెప్పాలంటే ఈ సారి టీమిండియా.. వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. ఓ దేశ భక్తుడిగా భారత్ గెలుస్తుందని చెప్పవచ్చు. కానీ జట్టు పరిస్థితి పరిగణలోకి తీసుకుంటే మాత్రం చాలా సమస్యలున్నాయి. ముఖ్యంగా మిడిలార్డర్ చాలా బలహీనంగా ఉంది. అంతేకాకుండా రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. గాయాల కారణంగా మిడిల్ ఆర్డర్‌లో సరైన ప్లేయర్లు కనిపించడం లేదు. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ కూడా గెలవకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అయితే నిజాలు ఒప్పుకోక తప్పదంటూ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వడమే టీమిండియా ముందున్న అతిపెద్ద సవాల్. అయితే మిడిల్ ఆర్డర్‌లో 4, 5 స్థానాలు చాలా కీలకం. రిషభ్ పంత్ కోలుకుంటే ఈ స్థానాల్లో ఆడేవాడు. ఇప్పుడు నాలుగో స్థానంలో సరైన బ్యాటర్‌ను కనిపెట్టడం టీమిండియా ముందున్న పెద్ద టాస్క్. రింకూ సింగ్ చాలా బాగా ఆడుతున్నాడు. వరల్డ్ కప్ గెలవాలంటే రింకూ సింగ్‌కి అవకాశం ఇచ్చి, తగినన్ని మ్యాచులు ఆడించాలని యువరాజ్ సింగ్ సూచించాడు.


Similar News