టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. రెండో టెస్టుకు వారిద్దరూ ఫిట్

భానత వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పుణె టెస్టుకు అందుబాటులో ఉండనున్నారు.

Update: 2024-10-22 19:21 GMT

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ముందు భారత జట్టుకు గుడ్ న్యూస్. వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పుణె టెస్టుకు అందుబాటులో ఉండనున్నారు. ఈ విషయాన్ని టీమిండియా బ్యాటింగ్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ వెల్లడించారు. మెడనొప్పి కారణంగా గిల్ తొలి టెస్టుకు దూరంగా ఉన్నాడు. మరోవైపు, తొలి టెస్టులో పంత్ కాలికి గాయమవ్వగా.. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో అతను కీపింగ్ చేయలేదు. దీంతో రెండో టెస్టు వారు ఆడటంపై అనుమానులు నెలకొనగా.. తాజగా ర్యాన్ టెన్ డోస్చేట్ స్పష్టతనిచ్చాడు. ‘పంత్ చాలా బాగున్నాడు. అలాగే,గత వారం గిల్ బెంగళూరులో నెట్స్‌లో బ్యాటింగ్ చేశాడు. గిల్ కొద్దిగా అసౌకర్యంగా ఉన్నాడు. కానీ, వీరిద్దిరూ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటారని అనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు. అలాగే, కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో రెండే ఓవర్లు వేయడంతో అశ్విన్ ఫిట్‌నెస్‌పై వార్తలు వచ్చాయి. కానీ, అశ్విన్ ఫిట్‌గా ఉన్నాడని బ్యాటింగ్ కోచ్ తెలిపాడు. పంత్, గిల్ అందుబాటులో రావడంతో తుది జట్టులో కేఎల్ రాహుల్‌ స్థానంపై సందిగ్ధం నెలకొంది. తొలి టెస్టులో దారుణంగా నిరాశపర్చిన అతన్ని పక్కనపెట్టాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. బెంగళూరు టెస్టులో టీమిండియా ఓటమిపాలై సిరీస్‌లో వెనుకబడిన విషయం తెలిసిందే. ఈ నెల 24 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.

Tags:    

Similar News