BGT 2024 : హ్యాట్రిక్ మనదే.. : మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్
ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించడం చాలా కష్టమని అయితే గత రెండు పర్యటనల్లో భారత్ సత్తా చాటి సిరీస్ సొంతం చేసుకుందని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు.
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించడం చాలా కష్టమని అయితే గత రెండు పర్యటనల్లో భారత్ సత్తా చాటి సిరీస్ సొంతం చేసుకుందని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. పెర్త్ టెస్టు రెండో రోజు టీంఇండియా పట్టు బిగించడంతో ఆయన ఈ మేరకు స్పందించారు. ‘ఇండియా గొప్ప ప్రదర్శన ఇచ్చింది. ఆస్ట్రేలియా వారి గడ్డపై డామినేట్ చేయడం కష్టం. కానీ భారత ఆటగాళ్లు మంచి శుభారంభం చేశారు. ఆస్ట్రేలియాపై భారత్ 4-1తో గెలిచి హ్యాట్రిక్ సిరీస్‌లు సొంతం చేసుకుంటుందని భావిస్తున్నా. టెస్ట్ మ్యాచ్ గెలవబోతున్నందుకు బుమ్రాకు కంగ్రాట్స్.’ అని హర్భజన్ సింగ్ అన్నాడు. పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ క్రమంగా పట్టు బిగుస్తోంది. జైస్వాల్(90), రాహుల్(62) రాణించడంతో భారత జట్టు రెండో రోజు ఆట ముగిసే సరికి 218 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.