ప్రత్యర్థులు ఒక్కటయ్యారు.. జకోకు కోచ్‌గా ముర్రే

వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌లో జకోకు ముర్రే కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు.

Update: 2024-11-23 18:31 GMT

దిశ, స్పోర్ట్స్ : వాళ్లిద్దరూ టెన్నిస్ కోర్టులో ప్రత్యర్థులు.. ఎన్నో మ్యాచ్‌ల్లో తలపడ్డారు. కానీ, ఇప్పుడు వారిలో ఒకరు మరొకరికి కోచ్‌ మారాడు. కోచ్‌గా అవతారమెత్తింది మరెవరో కాదు మూడు గ్రాండ్‌స్లామ్స్ విజేత, డబుల్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఆండ్రీ ముర్రే(ఇంగ్లాండ్). కోచింగ్ ఇవ్వబోతున్నది 24 గ్రాండ్‌స్లామ్స్ విజేత నోవాక్ జకోవిచ్(సెర్బియా)కు. టెన్నిస్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఈ వార్త నిజమే. వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌లో జకోకు ముర్రే కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ విషయాన్ని జకో శనివారం వెల్లడించాడు. ‘నా అతిపెద్ద ప్రత్యర్థుల్లో ఒక్కడైనా ముర్రే ఈ సారి నెట్‌లో కోచ్‌గా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఆండీతో కలిసి కొత్త సీజన్‌ను ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నా. మెల్‌బోర్న్‌లో మా ఇద్దరికి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి.’ అని జకో తెలిపాడు. కాగా, ముర్రే ఈ ఏడాది ఆగస్టులో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్(2011, 2013, 2015, 2016) ఫైనల్స్‌లో జకో, ముర్రే పోటీపడ్డారు. అన్ని మ్యాచ్‌ల్లో జకోనే విజయం సాధించడం గమనార్హం.

Tags:    

Similar News