Babita Phogat: దంగల్ టీమ్ మాట తప్పింది.. బబితా ఫొగాట్ ఆరోపణలు

దంగల్ టీమ్ తమకు మాట ఇచ్చి తప్పిందని రెజ్లర్ బబితా ఫొగాట్ ఆరోపించారు. తమ ఊరిలో అకాడమీ నిర్మించేందుకు సహాయం అడగ్గా.. కనీసం స్పందించలేదన్నారామె.

Update: 2024-10-23 08:50 GMT

దిశ, వెబ్ డెస్క్: మహవీర్ ఫొగాట్ కూతుర్లైన గీతా ఫొగాట్(Geeta Phogat), బబితా కుమారి (Babita Kumari Phogat)ల జీవిత కథ ఆధారంగా.. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా దంగల్ (Dangal). ఈ సినిమాలో ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా మెయిన్ లీడ్స్ గా నటించారు. నితీష్ తివారీ దర్శకత్వం వహించగా.. సిద్ధార్థ్ రాయ్ కపూర్, అమీర్ ఖాన్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. 2016, డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. తాజాగా ఈ సినిమా బృందంపై రెజ్లర్ బబితా ఫొగాట్ కీలక ఆరోపణలు చేసింది.

దంగల్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్ల కలెక్షన్లు రాగా.. తమకు మాత్రం కోటిరూపాయలు కూడా ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసిందామె. తమ గ్రామంలో ఒక అకాడమీ నిర్మించేందుకు సహాయం కోరగా.. చిత్రబృందం పట్టించుకోలేదని విమర్శించారు. ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. అన్నివేల కోట్ల లాభం వచ్చినా.. తమకు చాలా తక్కువ మొత్తం ఇవ్వడాన్ని తప్పుపట్టింది బబితా ఫొగాట్. పోని తమకు అకాడమీ కోసం సహాయం కూడా చేయలేదని వాపోయింది.

బబితా ఫొగాట్ రెజ్లింగ్ కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది. 2010 కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో రజత పతకాన్ని గెలిచింది. 2012లో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యాన్ని సాధించడంతో ఆమె పేరు మారుమ్రోగింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ తో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. 2016 రియో ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. 2019లో బబితా రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించి.. రాజకీయాలవైపు నడిచారు. 

Tags:    

Similar News