Siva Karthikeyan: సోషల్ మీడియాకు దూరంగా ఉండండి.. స్టార్ హీరో విజ్ఞప్తి
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) ఇటీవల ‘అమరన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) ఇటీవల ‘అమరన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇఫ్ఫీ వేడుకల్లో పాల్గొన్న శివ కార్తికేయన్ యూత్‌కు ఓ విజ్ఞప్తి చేశాడు. ‘‘గత రెండేళ్లుగా నేను సోషల్ మీడియా(Social Media)ను తక్కువగా వాడుతున్నాను.
ఇంటర్నెట్‌గా చాలా సమాచారం ఉన్నప్పటికీ అతిగా వాడకూడదు. ముఖ్యంగా (ట్విట్టర్) X లాంటి మాధ్యమాలనే చూడటం యూత్ వీలైనంత వరకు తగ్గించండి. ఈ విషయం తెలుసుకుని ఎలాన్ మస్క్(Elon Musk) నా ఎక్స్ ఖాతాను బ్లాక్ చేస్తాడేమో అనిపిస్తుంది. ఒకవేళ అది జరిగితే నా మొదటి విజయం అవుతుంది. సోషల్ మీడియా నుంచి బయటకే వస్తే మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయని అనుకుంటా.
ఇతరుల అభిప్రాయాలు మనపై పడవు. అయితే నా సినిమాలు ఫ్లాప్ అనే మాట వినబడితే గందరగోళానికి గురవుతా. అప్పుడు సోషల్ మీడియాలో వెతుకుతూ ఉంటా. అయితే నేను టెలివిజన్ రంగంలో ఉన్నప్పుడు అసలు సోషల్ మీడియా లేదు. ప్రశంసలు, విమర్శలు నేరుగా ప్రేక్షకుల నుంచి వచ్చేవి. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే.. భారతీయులకున్న మంచి లక్షణం నెగిటివ్స్ చెప్పరు. ఫ్లాప్ అయినా మంచి విషయాలను మాత్రమే చెబుతారు’’ అని చెప్పుకొచ్చాడు.