Musheer Khan : రోడ్డు ప్రమాదానికి గురైన యువ క్రికెటర్ ముషీర్ ఖాన్

టీమ్ ఇండియా క్రికెటర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సోద‌రుడు ముషీర్ ఖాన్‌కు రోడ్డు ప్ర‌మాదం జరిగినట్లు సమాచారం.

Update: 2024-09-28 06:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీమ్ ఇండియా క్రికెటర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సోద‌రుడు ముషీర్ ఖాన్‌కు రోడ్డు ప్ర‌మాదం జరిగినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని, దీంతో అతని మెడకు గాయమైనట్లు తెలిసింది. ఇరానీ క‌ప్ మ్యాచ్ కోసం కాన్పూర్ నుంచి ల‌క్నోకు వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌మాదం చోటుచేసుకున్నది. అయితే, ఇరానీ క‌ప్ కోసం ల‌క్నోకు వెళ్లిన ముంబై జ‌ట్టుతో అత‌ను ట్రావెల్ చేయ‌లేదు. ఆజంఘ‌ర్ నుంచి అత‌ను తండ్రితో క‌లిసి వెళ్లిన‌ట్లు తెలిసింది.

కాగా, 19 ఏళ్ల ముషీర్ ఖాన్ భారత యువ క్రికెట‌ర్‌. ప్ర‌స్తుతం ముంబై త‌ర‌పున ఆడుతున్నాడు. ఇటీవ‌ల దులీప్ ట్రోఫీలో ఇండియా సీ జ‌ట్టు త‌ర‌పున ఆడి 181 ర‌న్స్ స్కోర్ చేసి.. ఆకట్టుకున్నాడు. అత‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 9 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. కానీ యాక్సిడెంట్ వ‌ల్ల అత‌ను ఇరానీ ట్రోఫీకి ఆడటం కష్టమేనని సమాచారం. ఇక అక్టోబ‌ర్ 11వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే రంజీ సీజ‌న్‌కు కూడా ముషీర్ ఖాన్ మిస్ అయ్యే చాన్స్ ఉంది. 


Similar News