WI VS IND 2nd Test: టీమిండియా యంగ్ ప్లేయర్లను కలిసిన మిస్ వరల్డ్..
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు మిస్ వరల్డ్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆచె ఆబ్రహామ్స్ టీమిండియా యంగ్ స్టార్ ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్‌లను కలిసింది.
దిశ, వెబ్‌డెస్క్: ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు మిస్ వరల్డ్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆచె ఆబ్రహామ్స్ టీమిండియా యంగ్ స్టార్ ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్‌లను కలిసింది. ఈ సందర్భంగా ఆమె వారితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబర్చింది. ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్‌కు స్టేటస్‌గా పెట్టుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ఫోటోలు దర్శనమిస్తున్నాయి. మిస్ వరల్డ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆచె ఆబ్రహామ్స్.. వెస్టిండియన్ లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారా ఆహ్వానం మేరకు భారత్-విండీస్ మ్యాచ్ చూసేందుకు క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానానికి వచ్చింది.
Miss World Aché Abrahams of Trinidad & Tobago meets Shubman Gill & Ishan Kishan.
— RevSportz (@RevSportz) July 22, 2023
In this interview she shares her excitement and joy of interacting with the Indian cricketers.@Wowmomo4u @debasissen #WIvIND pic.twitter.com/RCQwRWARl9