Virat Kohli: అత్యంత అరుదైన రికార్డు ముంగిట కోహ్లీ..

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించిన విషయం తెలిసిందే.

Update: 2023-07-10 14:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి అత్యంత అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. జూలై 12న ఆరంభం కానున్న తొలి టెస్టులో విండీస్‌ తుది జట్టు కూర్పుపై కోహ్లీ ఈ ఘనత సాధిస్తాడా లేదా అన్న విషయం ఆధారపడి ఉంది. ఇప్పటికే సచిన్‌ పేరిట ఉన్న ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ.. విండీస్‌ తొలి టెస్టు సందర్భంగా సచిన్ మరో అరుదైన రికార్డును సమం చేసే అవకాశం ఉంది.

1992లో ఆస్ట్రేలియా పర్యటనలో సచిన్‌.. జెఫ్‌ మార్ష్‌ భాగంగా ఉన్న జట్టుతో తలపడ్డాడు. ఆ తర్వాత 2011/12 టూర్‌లో జెఫ్‌ కుమారుడు షాన్‌ మార్ష్‌తో ఉన్న టీమ్‌తోనూ పోటీపడ్డాడు. ఇప్పుడు విరాట్‌ కోహ్లి ప్రస్తుత సిరీస్‌తో సచిన్‌ సరసన నిలిచే అవకాశం ఉంది. అదెలాగంటే.. 2011 వెస్టిండీస్‌ పర్యటన సందర్భంగా.. కోహ్లి.. శివ్‌నరైన్‌ చందర్‌పాల్‌ భాగంగా ఉన్న జట్టుతో ఆడాడు. ఇక ఇప్పుడు శివ్‌నరైన్‌ తనయుడు తగ్‌నరైన్‌ చందర్‌పాల్‌ విండీస్‌ టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా ఎదుగుతున్నాడు. ఈ నేపథ్యంలో తుది జట్టులో అతడు చోటు దక్కించుకుంటే.. విదేశీ గడ్డ మీద ప్రత్యర్థి జట్ల తండ్రీ- కొడుకులతో ఆడిన రెండో బ్యాటర్‌గా కోహ్లి చరిత్రకెక్కుతాడు. అంతకంటే ముందు ఈ ఘనత సాధించిన సచిన్‌ సరసన నిలుస్తాడు.


Similar News