చరిత్ర సృష్టించిన పసికూన జట్టు.. 20 ఓవర్లలో 344 పరుగులు

ఇటీవల భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో భారత్ బ్యాటర్ల ఉచకోతతో 20 ఓవర్లలో 297 పరుగులు చేసింది.

Update: 2024-10-23 13:26 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో భారత్ బ్యాటర్ల ఉచకోతతో 20 ఓవర్లలో 297 పరుగులు చేసింది. కాగా ఈ రికార్డును కొద్దిరోజుల్లోనే పసికూన జట్టు అయిన జింబాబ్వే తూడిచిపెట్టేసి.. ప్రపంచ రికార్డులను బ్రేక్ చేసింది. అలాగే టి20లో అత్యధిక పరుగుల రికార్డులను నెలకొల్పింది. వివరాల్లోకి వెళితే.. ICC పురుషుల T20 ప్రపంచ కప్ సబ్-రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ 2024 లో భాగంగా గ్రూప్-B లో ఉన్న గాంబియా, జింబాబ్వే మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే బ్యాటర్లు.. గాంబియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. 27 సిక్సర్లు, 30 ఫోర్లు బాదారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే జట్టు 344 పరుగులు చేసింది. ఇందులో బ్రియాన్ బెన్నెట్ 50, టి మారుమణి 62, రజా 133*, క్లైవ్ మదాండే 53* ర్యాన్ బర్ల్ 25 పరుగులు చేశారు. వీరిలో కెప్టెన్ సికిందర్ రాజా.. కేవలం 43 బంతుల్లో 7 ఫోర్లు, 15 సిక్సర్లతో ఏకంగా 133 పరుగులతో రెచ్చిపోయాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 344 పరుగులు చేసి.. పురుషుల అంతర్జాతీయ టీ20 క్రి కెట్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు.


Similar News