ఎమర్జింగ్ ఆసియాకప్ లో భారత్ 'ఏ' మరో ఘనవిజయం
ఎమర్జింగ్ ఆసియాకప్(Emerging Asia Cup) లో భారత్ 'ఏ' మరో విజయాన్ని నమోదు చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : ఎమర్జింగ్ ఆసియాకప్(Emerging Asia Cup) లో భారత్ 'ఏ' మరో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఒమన్ 'ఏ' తో జరిగిన మ్యాచ్ లో.. తొలుత ఒమన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 15.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. ఆయుష్ బదొని 51 పరుగులు చేయగా.. అభిషేక్ శర్మ 34 పరుగులు చేసి.. జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ సెమీస్ కు చేరింది. శుక్రవారం సెమీస్ మ్యాచ్ లో భారత్.. ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది.