కోహ్లీతో బాబర్ ఆజామ్‌కు పోలికా?.. నవ్వొస్తుంది : పాక్ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ ప్రశంసలు కురిపించాడు.

Update: 2024-12-23 11:05 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ‌పై ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమీర్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ ఈ తరం గ్రేటెస్ట్ ప్లేయర్ అని కొనియాడాడు. బాబర్ ఆజామ్, స్టీవ్ స్మిత్, జో రూట్‌లను అతనితో పోల్చినప్పుడు తనకు నవ్వొస్తుందన్నాడు. ‘విరాట్‌తో ఎవరినీ పోల్చలేం. ఎన్నో మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించాడు. ఇది ఏ ఆటగాడికైనా సాధ్యం కాదనిపిస్తుంది. ఒక్క ఫార్మాట్‌లోనే కాదు.. అన్ని ఫార్మాట్లలోనూ విరాట్ ఈ తరం అత్యుత్తమ బ్యాటర్. క్రికెట్‌పై అతని నిబద్ధతే మరింత ప్రత్యేకంగా మార్చింది. 2014 ఇంగ్లాండ్‌‌లో దారుణంగా విఫలమయ్యాడు. కానీ, అతని పునరాగమనం అద్భుతంగా ఉంది. ఆ తర్వాత 10 ఏళ్లుగా నిలకడగా రాణించడమనేది అంత సులభం కాదు’ అని ప్రశంసించాడు. అలాగే, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌‌ను గుర్తు చేసుకున్న అమీర్.. విరాట్ అవుట్ కాకపోతే తాము ఓడిపోయే వాళ్లమని చెప్పాడు. ఎందుకంటే, ఛేదనలో కోహ్లీకి అసాధారణమైన రికార్డు ఉందన్నాడు. కాగా, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి పాక్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News