‘ఆ రోజు చాలా భయపడ్డా’.. ఆసక్తికర విషయం బయటపెట్టిన విరాట్ కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పరుగుల వరద పారించిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. 744 రన్స్‌తో 2024 సీజన్ ఆరెంజ్ క్యాప్

Update: 2024-05-31 10:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పరుగుల వరద పారించిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. 744 రన్స్‌తో 2024 సీజన్ ఆరెంజ్ క్యాప్ అవార్డ్ గెల్చుకున్నాడు. ఐపీఎల్ ముగియడంతో జూన్‌లో అమెరికా, వెస్టిండిస్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌పై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అమెరికా పయనమయ్యాడు. దీనికి ముందు కోహ్లీ ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్రికెట్‌లో తన మొదటి వరల్డ్ కప్ మ్యాచ్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకున్నాడు. 2011లో బంగ్లాదేశ్‌పై తన మొదటి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడానని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌కు ముందు తీవ్ర ఆందోళనకు గురి అయ్యాయని.. చాలా భయపడ్డానన్న ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టాడు.

మ్యా్చ్‌కు ముందు రోజు రాత్రి టెన్షన్, ఉత్కంఠతో సరిగ్గా నిద్ర కూడా పట్టలేదని చెప్పాడు. 2011 ఇండియా వరల్డ్ కప్ టీమ్‌లో తానే యంగెస్ట్ ప్లేయర్లనన్న కోహ్లీ.. వరల్డ్ కప్‌లో సచిన్, ధోని, సెహ్వాగ్ వంటి గొప్ప ప్లేయర్స్‌తో కలిసి ఆడటం ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో పాటు ఆ మ్యాచ్‌లో తన సెంచరీ ఇన్సింగ్‌ను కోహ్లీ రివైజ్ చేసుకున్నాడు. ఫస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లోనే 83 బంతుల్లో సెంచరీ బాదానని గుర్తు చేశాడు. కాగా, 2011 వరల్డ్ కప్ టైటిల్‌ను టీమిండియా గెల్చుకున్న విషయం తెలిసిందే. ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేసి టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. 


Similar News