ఐపీఎల్ మెగా వేలంలో అన్‌సోల్డ్.. నేడు ప్రపంచంలో ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ నమోదు
రెండు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్(IPL) మెగా వేలంలో అమ్ముడుపోని యువ ప్లేయర్.. సంచలన రికార్డ్ బ్రేక్ చేశాడు.
దిశ, వెబ్ డెస్క్: రెండు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్(IPL) మెగా వేలంలో అమ్ముడుపోని యువ ప్లేయర్.. సంచలన రికార్డ్ బ్రేక్ చేశాడు. టీ20లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్‌గా యువ ప్లేయర్ గా ఉర్విన్ పటేల్(Urwin Patel) నిలిచాడు. వివరాల్లోకి వెలితే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy)లో ఈ ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ(Fastest T20 century) నమోదైంది. త్రిపురతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ జట్టుకు చెందిన బ్యాటర్ ఉర్విన్ పటేల్ ఏకంగా 28 బంతుల్లో సెంచరీ నమోదు చేసి టీ20లలో వేగవంతమైన సెంచరీని నమోదు చేసుకున్నాడు. కాగా గతంలో ఈ రికార్డు భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్(Rishabh Pant) పేరు మీద ఉంది. ఆయన 32 బంతుల్లోనే సెంచరీ నమోదు చేయగా.. ఈ రికార్డును ఉర్విన్ 28 బంతుల్లో బ్రేక్ చేశాడు. దీంతో ఈ మ్యాచులో గుజరాత్ జట్టు ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇంత టాలెంట్ ఉన్న ఈ యువ ప్లేయర్ ను వేలంలో ఏ జట్టు కొనకపోవడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.