ఎంఎస్ ధోనితో ఆటోగ్రాఫ్ తీసుకున్న కోలీవుడ్ ఫిల్మ్ మేకర్..

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న అభిమానుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

Update: 2023-07-12 11:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న అభిమానుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తాజాగా చెన్నైలో తన సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన ధోని దగ్గర కోలీవుడ్ ఫిల్మ్ మేకర్., నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఆటో గ్రాఫ్ తీసుకున్నాడు. ధోని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద తెరకెక్కిన సినిమా “LGM”.. ఈ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకువెళ్ళడానికి ధోని కొన్ని రోజులుగా చెన్నైలోనే ఉంటున్నాడు. అందులో భాగంగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ధోనిని కలిసి తన టీ షర్ట్‌పైన ధోని ఆటో గ్రాఫ్‌ను తీసుకున్నాడు.

ఈ సందర్భాన్ని ఊహించని విఘ్నేష్ శివన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు.. 'నా హీరో, నా కెప్టెన్ నా రోల్ మోడల్ ధోని కలిసి ఆటో గ్రాఫ్ తీసుకోవడం చాల ఆనందంగా ఉందంటూ'.. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నాడు. ధోనీ తమిళంలో సినిమా తీయడం ఆనందంగా ఉంది. మా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పోస్టు చేశారు.

Read More:   Athulya Ravi : స్టన్నింగ్ లుక్స్ తో కుర్రాళ్ల హృదయాలను మెస్మరైజ్‌ చేస్తోన్న అతుల్య రవి


Similar News