ఒక్క ఫోన్ చేయండి.. రిటైర్మెంట్ యూటర్న్‌పై వార్నర్ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ యూటర్న్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు.
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ యూటర్న్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసిస్ తరపున ఆడాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడుతూ.. భారత్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడాలని ఆడాలని ఉందని, ఆ సిరీస్‌లో ఓపెనింగ్ చేసేందుకు సిద్ధమేనని తెలిపాడు. ‘ఆసిస్‌కు ఆడేందుకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. ఒక్క ఫోన్ చేయండి. సీరియస్‌గా చెబుతున్నా. ఆ సిరీస్‌లో నా అవసరం ఉందంటే వచ్చే షీల్డ్ గేమ్ కంటే ఆసిస్‌కు ఆడటాన్ని ఎక్కువగా సంతోషిస్తా.’ అని తెలిపాడు.
కాగా, వచ్చే ఏడాది పాక్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ఆడాలని ఉందని ఇటీవల వార్నర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో పాక్‌పై వార్నర్ చివరి టెస్టు ఆడాడు. ఆ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వార్నర్ రిటైర్ అయిన తర్వాత స్మిత్ ఓపెనర్‌గా వస్తున్నాడు. కానీ, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్మిత్ తిరిగి 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఇటీవల స్పష్టతనివ్వడంతో ప్రస్తుతం ఓపెనింగ్ స్థానం ఖాళీగా ఉంది.