యూరో కప్.. నాకౌట్‌కు ఇటలీ!

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ టోర్నీలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.

Update: 2024-06-26 17:38 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ టోర్నీలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇటీవల ప్రారంభమైన యూరోకప్‌కు ప్రపంచ వ్యాప్తంగా చక్కటి ఆదరణ లభిస్తోంది. జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో ఛాంపియన్ షిప్ నాకౌట్స్ టోర్నీలోకి ఇటలీ జట్టు అడుగుపెట్టింది. అంతకుముందు క్రొయేషియాతో జరిగిన గ్రూప్-బి మ్యాచును ఆ జట్టు 1-1తో డ్రాగా ముగించింది. మ్యాచ్ 55 నిమిషంలో క్రొయేషియా జట్టు ఆటగాడు మోద్రిచ్ గోల్ కొట్టడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.స్టాపేజ్ టైంలో జకాని (90+8) గోల్‌తో ఇటలీ స్కోరును క్రొయేషియా సమం చేసింది. దీంతో గ్రూప్ నుంచి రన్నరప్‌గా ఇటలీ జట్టు ముందుకు దూసుకెళ్లింది. ఈనెల 29న జరిగే మ్యాచులో (రౌండ్ 16లో) స్విట్జర్లాండ్ జట్టుతో ఇటలీ తలపడనుంది. కాగా, మరోవైపు 1-0తో అల్బేరియాపై గెలిచిన స్పెయిన్ గ్రూప్ -బిలో అగ్రస్థానంలో నిలిచింది.

కోపా అమెరికా..(బ్రెజిల్ VS కోస్టారికా)

కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీలో కోస్టారికా జట్టు 0-0తో బ్రెజిల్ జట్టును నిలువరించింది. ఈ గ్రూప్ -డి మ్యాచుల బ్రెజిల్ చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కోస్టారికా డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. కోస్టారికా గోల్ కీపర్ ప్యాట్రిక్ సిక్వేరా 3 సేవ్‌లు చేయగలిగాడు. కాగా, గ్రూపులో జరిగిన మరో మ్యాచులో కొలంబియా 2-1 గోల్స్ తేడాతో పరాగ్వేను ఓడించింది.

Similar News