BREAKING: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. పూర్తి జట్టు ఇదే

టీ-20 వరల్డ్ కప్‌లో తుది పోరుకు సమయం ఆసన్నమైంది. ఫైనల్ మ్యాచ్‌లో తలపడేందుకు ఇండియా, దక్షిణాఫ్రికా సిద్ధం అయ్యాయి.

Update: 2024-06-29 14:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ-20 వరల్డ్ కప్‌లో తుది పోరుకు సమయం ఆసన్నమైంది. ఫైనల్ మ్యాచ్‌లో తలపడేందుకు ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధం అయ్యాయి. బ్రిడ్జిటౌన్ వేదికగా రాత్రి 8 గంటలకు కీలకమైన ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టైటిల్ రేసులో అతి ముఖ్యమైన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి సౌతాఫ్రికా మొదట బౌలింగ్ చేయనుంది. బ్రిడ్జిటౌన్ పిచ్‌పై ఛేజింగ్‌ సవాల్‌తో కూడుకోవడంతో టాస్ గెలవగానే రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సెమీ ఫైనల్లో గెలిచిన సేమ్ టీములతోనే ఇండియా, దక్షిణాఫ్రికా టీమ్స్ బరిలోకి దిగాయి. టీమిండియా వరల్డ్ కప్ గెలవక కొన్ని ఏండ్లు కావడంతో ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకోవాలని 140 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(c), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ


Similar News