T20 World Cup 2024 : టాస్ నెగ్గిన భారత్.. బార్బడోస్‌లో ఆ లెక్కలు చూస్తే టైటిల్ టీమ్ ఇండియాదే
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మొదలైంది.
దిశ, స్పోర్ట్స్ : భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మొదలైంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం వేదిక. టీమ్ ఇండియా టాస్ నెగ్గగా కెప్టెన్ రోహిత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ తీసుకున్న నిర్ణయం కలిసొస్తుందా?లేదా? అన్నది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే, కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో టీ20 గణాంకాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఆ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువగా గెలిచింది. 32 మ్యాచ్‌లు జరగగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు 19 సందర్భాల్లో గెలిచాయి. చేజింగ్ జట్లు 10 సార్లు నెగ్గాయి. ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఆ స్టేడియంలో 8 మ్యాచ్‌లు జరిగాయి. అందులో నాలుగింట ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయాలు నమోదు చేశాయి. మూడింట సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు నెగ్గాయి. మరి, ఫైనల్‌లో టీమ్ ఇండియా గెలుస్తుందో లేదా చూడాలి.