మూడు కీలక వికెట్లు కోల్పోయిన భారత్.. ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే..!
టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో టీమిండియా బ్యాటర్స్ తడబడుతున్నారు. బ్రిడ్జిటౌన్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట
దిశ, వెబ్‌డెస్క్: టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో టీమిండియా బ్యాటర్స్ తడబడుతున్నారు. బ్రిడ్జిటౌన్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు టీమిండియాకు ఆట ప్రారంభంలోనే వరుస షాకులు తగిలాయి. సౌతాఫ్రికా బౌలర్స్ కట్టుదిట్టమైన బంతులు వేయడంతో టీమిండియా బ్యాటర్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై అద్భుతమైన ఇన్నింగ్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో చేతులేత్తేశాడు. 5 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించిన యంగ్ బ్యాటర్ పంత్ టోర్నీ చివరి మ్యాచ్‌లో డకౌట్ అయ్యి తీవ్రంగా నిరాశ పర్చాడు. టీ20 నెంబర్ వన్ బ్యాటర్ సూర్య కుమార్ సైతం ఫైనల్ మ్యాచులో చేతులేత్తేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో స్టార్ బ్యాటర్ కోహ్లీ 37, అక్షర్ పటేల్ 21 ఉన్నారు. 10 ఓవర్లకు టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. టీమిండియా ఆశలన్నీ కోహ్లీ, వైస్ కెప్టెన్ హర్ధిక్ పాండ్యాపైనే ఉన్నాయి.