Naomi Osaka: ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళా టెన్నిస్ స్టార్..

జపాన్‌కు చెందిన ప్రముఖ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి నవోమీ ఒసాకాకు కూతురు పుట్టింది.

Update: 2023-07-12 14:31 GMT

టోక్యో: జపాన్‌కు చెందిన ప్రముఖ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి నవోమీ ఒసాకాకు కూతురు పుట్టింది. నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన 25 ఏళ్ల ఒసాకా బాయ్‌ఫ్రెండ్ కోర్టే మొదటి బిడ్డకు స్వాగతం పలికారని ఓ ఆంగ్ల పత్రిక తెలిపింది. త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని, అమ్మాయినే కోరుకుంటున్నామని ఒసాకా దంపతులు ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెళ్లడించారు.

ఆరు నెలల విశ్రాంతి తర్వాత వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనాలని భావిస్తున్నట్లు ఒసాకా తెలిపింది. 2018లో తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన ఒసాకా 2019లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీ కూడా కైవసం చేసుకుంది. 2020లో యూఎస్ ఓపెన్, 2021లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించడం ద్వారా నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఒసాకా ఖాతాలో పడ్డాయి.


Similar News