Sunil Gavaskar: నాలుగో టెస్ట్‌లో అతడిని పక్కన పెట్టొద్దు.. సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024)లో భాగంగా భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) మధ్య మెల్‌బోర్న్ (Melbourne) వేదికగా నాలుగో టెస్ట్ గురువారం ప్రారంభం కాబోతోంది.

Update: 2024-12-25 16:58 GMT
Sunil Gavaskar: నాలుగో టెస్ట్‌లో అతడిని పక్కన పెట్టొద్దు.. సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024)లో భాగంగా భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) మధ్య మెల్‌బోర్న్ (Melbourne) వేదికగా నాలుగో టెస్ట్ గురువారం ప్రారంభం కాబోతోంది. జరిగిన మూడు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించగా.. ఆడిలైడ్ (Adelaide) టెస్ట్ డ్రాగా ముగిసింది. సిరీస్‌పై పట్టు సాధించాలంటే ఇరు జట్లకు నాలుగో టెస్ట్‌లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, ఈ మ్యాచ్‌ కోసం అత్యంత వేగవంతమైన పిచ్‌ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు భారత మాజీ ఆటగాళ్లు కూడా టీమిండియా (Team India) ఈ మ్యాచ్‌లో తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. మెల్‌బోర్న్ (Melbourne) టెస్ట్‌లో తెలుగు తేజం, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)ని ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టొద్దని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఆడిన మూడు మ్యాచ్‌లలో నితీశ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అదేవిధంగా చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడని కామెంట్ చేశారు. ఒకవేళ అతడిని తప్పిస్తే.. అంత కంటే తెలివి తక్కువ పని మరేది లేదని ఉండదని సునీల్ గవాస్కర్ అన్నారు. 

Tags:    

Similar News