ఐపీఎల్‌ 2025లో భారీ ఇంపాక్ట్ చూపిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్లు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా లీగ్ ప్రారంభం అయింది.

Update: 2025-03-26 04:40 GMT
ఐపీఎల్‌ 2025లో భారీ ఇంపాక్ట్ చూపిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్లు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా లీగ్ (IPL Mega League) ప్రారంభం అయింది. ఈ నెల 22న కోల్ కత్తా వేదికగా ఐపీఎల్ ప్రారంభం కాగా.. మంగళవారం వరకు 10 జట్లు తమ మొదటి మ్యాచులను ఆడేశాయి. ఈ క్రమంలో అన్ని జట్ల మొదటి మ్యాచుల్లో పరుగుల వరద సృష్టించాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు మొదటి మ్యాచులోనే ఐపీఎల్ చరిత్రలోనే (History of IPL) రెండవ అత్యధిక స్కోరును (Second highest score) నమోదు చేసి రికార్డు సృష్టించింది. అనంతరం ఇతర జట్లు సైతం సునాయాసంగా 200 కంటే ఎక్కువ పరుగులు కొడుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఐపీఎల్ 2023 లో భాగంగా 16వ సీజన్ లో కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ (Impact Player Rule)ను బీసీసీఐ (BCCI) తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్ ఐపీఎల్ జట్లకు సువర్ణావకాశం గా మారింది. ముఖ్యంగా 18వ సీజన్ లో తొలి ఐదు మ్యాచుల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ జట్లకు ఎంతగానో కలిసొచ్చింది. ముఖ్యంగా మొదటి మ్యాచ్ నుంచి ప్రతి జట్టు ఈ రూల్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాల్లు తమ సత్తాను చాటు తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ తరఫున ఆడిన అషుతోష్ శర్మ క్లిష్ట పరిస్థితిలో వచ్చి జట్టుకు విజయం సాధించిపెట్టాడు.

అలాగే నిన్న జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వైశాఖ్ విజయ్ కుమార్.. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారీ షాట్లతో రెచ్చిపోతున్న బ్యాటర్లకు తన బంతిని దొరక్కుండా బౌలింగ్ వేసి మ్యాచుకు విజయం సాధించిపెట్టాడు. అలాగే ముంబై, చెన్నై మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన విగ్నేష్ పుతూర్ 3 వికెట్లు తీసుకుని చెన్నై జట్టుకు ఓటమి భయం కల్పించాడు. ఇలా ప్రతి జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్లు తమ సత్తాను చాటుతు జట్లుకు విజయాలను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే 12వ ప్లేయర్ కు జట్టులో అవకాశం కల్పించే ఈ నిర్ణయాన్ని మొదటి నుంచి పలువురు సీనియర్ ప్లేయర్లు తప్పుబడుతున్నారు.

Tags:    

Similar News