Steven Finn: రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్ ఫాస్ట్‌ బౌలర్‌..

ఇంగ్లండ్ ఫాస్ట్‌ బౌలర్‌ స్టీవెన్‌ ఫిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Update: 2023-08-14 11:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ ఫాస్ట్‌ బౌలర్‌ స్టీవెన్‌ ఫిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. యాషెస్‌ సిరీస్‌-2023 సందర్భంగా తొలుత స్టువర్ట్‌ బ్రాడ్‌, ఆ తర్వాత మొయిన్‌ అలీ రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.  కొద్ది రోజుల గ్యాప్‌లో ఇంగ్లండ్‌ టీ20 వరల్డ్‌కప్‌ విన్నర్‌ అలెక్స్‌ హేల్స్‌, తాజాగా స్టీవెన్‌ ఫిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2010లో అం‍తర్జతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఫిన్‌.. 2017 వరకు ఇంగ్లండ్‌ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్‌ సిరీస్‌ విన్నింగ్‌ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు.

గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్నాడు ఫిన్‌. తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిన్‌ ఓ స్టేట్‌మెంట్‌ ద్వారా వెల్లడించాడు. 2010-16 మధ్యలో ఇంగ్లండ్‌ తరఫున 36 టెస్ట్‌లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2011లో వన్డే అరంగ్రేటం చేసిన ఫిన్‌ 69 వన్డేల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. 2011-15 మధ్యలో 21 టీ20 ఆడిన ఫిన్‌ 27 వికెట్లు తీశాడు. టెస్ట్‌ల్లో ఫిన్‌ ఓ హాఫ్‌ సెంచరీతో రాణించాడు.


Similar News