రచిన్ రవీంద్ర సెంచరీ..న్యూజిలాండ్ 402అలౌట్

బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సాగుతున్న భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టులో మూడవ రోజున న్యూజిలాండ్ 91.3ఓవర్లలో 402పరుగుల భారీ స్కోర్ సాధించి అలౌట్ అయ్యింది

Update: 2024-10-18 08:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సాగుతున్న భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టులో మూడవ రోజున న్యూజిలాండ్ 91.3ఓవర్లలో 402పరుగుల భారీ స్కోర్ సాధించి అలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 46పరుగులకే అలౌట్ కావడంతో కివీస్ 356పరుగుల భారీ అధిక్యత సాధించింది. రచిన్ రవీంద్ర 157బంతుల్లో 134పరుగులతో టాప్ స్కోరర్ గా నిలువడంతో పాటు ఈ మ్యాచ్ పై కివీస్ పట్టు సాధించేలా కీలక భూమిక పోషించాడు. ఓవర్ నైట్ స్కోర్ 183/3 తో మూడో రోజు ఆట ప్రారంభించిన కివీస్ బ్యాటర్ల జోరుకు టీమిండియా బౌలర్లు అడ్డుపడ్డారు. దీంతో ఒక దశలో 233/7 స్కోరుతో కివీస్ కష్టాల్లో పడింది.

మిచెల్ 18, టామ్ బ్లండెల్ 5, గ్లెన్ ఫిలిప్స్ 14, మాట్ హెన్రీ8 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ పరిస్థితుల్లో రచిన్ రవీంద్రకు తోడైన టీమ్ సౌథీ(65) రెచ్చిపోయి ఆడాడు. దీంతో వీరిద్ధరి అండతో కివీస్ భారీ స్కోర్ సాధించింది. రచీన్ రవీంద్ర సెంచరీ పూర్తి చేసుకోగా, సౌథీ హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం అజాజ్ పటేల్ 4 పరుగులకే అవుటవ్వగా, ఆఖరి వికెట్ గా రవీంద్ర వెనుతిరిగాడు. అంతకుముందు రోజున కివీస్ బ్యాటర్లలో కాన్వే 91, లాథమ్ 15, యంగ్ 33పరుగులు సాధించారు. రూర్కే(0) పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. భారత బౌలర్లలో జడేజా, కుల్ధీప్ యాదవ్ లు చెరో 3వికెట్లు, సిరాజ్ 2, అశ్విన్, బూమ్రాలు ఒక్కో వికెట్ తీశారు. భారత్ తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.  


Similar News