Viral video: కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో శిఖర్ ధావన్.. ఎవరంటే?
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్(Shikhar Dhawan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్(Shikhar Dhawan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతేడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి.. పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy 2025) అఫీషియల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా ధవన్ ఫిబ్రవరి 20న దుబాయ్‌లో జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఈ క్రమంలో ధవన్ వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తుండగా అతడి పక్కనే ఓ విదేశీ యువతి తారసపడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో ధవన్ కొత్త అమ్మాయితో ప్రేమలో పడ్డాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అంతేకాదు, ఆ అమ్మాయి గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. దీంతో ఆమె పేరు సోఫీ షైన్ అని, ఐర్లాండ్‌కు చెందిన ఆమెను ధవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కూడా చేస్తున్నట్లు బయటపడింది. కాగా, ధవన్ కొద్ది రోజుల కిందట ఇదే యువతితో ఎయిర్‌పోర్ట్‌లో కూడా కనిపించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కాగా, శిఖర్ ధవన్ 2012లో ఆసీస్ పౌరురాలైన అయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లాడాడు. అయేషా ధవన్ కంటే పదేళ్లు పెద్దది. ధవన్‌తో పెళ్లి కాక ముందే అయేషాకు వేరే వ్యక్తితో వివాహమైంది. ధవన్, ఆయేషాకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. వీరిద్దరూ 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ధవన్ ఒంటరిగా ఉన్నాడు. అయేషాతో విడిపోయాక ధవన్ ఎక్కువగా తన కుమారుడి గురించి సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నాడు. అయేషా బిడ్డను తనతో కలువనివ్వట్లేదని ధవన్ పలు సందర్భాల్లో వాపోయాడు.