Sunrisers: ప్రాక్టీస్ మ్యాచులో సన్ రైజర్స్ బ్యాటర్ల ఊచకోత

Update: 2025-03-16 07:16 GMT

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో ప్రస్తుతం క్రికెట్ అభిమానులు చూపు మొత్తం 2025 ఐపీఎల్ (IPL)  మీదనే ఉంది. ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన ఈ ఐపీఎల్ సీజన్.. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లు ప్లేయర్లు తమ తమ హోమ్ గ్రౌండ్‌లలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అయితే 2025 కు ముందు జరిగిన మెగా వేలంలో (Mega Auction) కీలక ప్లేయర్లు ఆయా జట్లను మారిపోయారు. కానీ.. సన్ రైజర్స్ జట్టు (Sunrisers team) లో మాత్రం భారీ హిట్టర్లను రిటైన్ చేసుకోవడంతో పాటు మరికొంతమంది హిట్టర్లను జట్టులోకి తీసుకొచ్చారు. గత సీజన్లో పలు జట్లపై హైదరాబాద్ బ్యాటర్లు (Hyderabad batters) చేసిన విధ్వంసం.. వారికి పీడకల (nightmare)గా మిగిలిపోయందనే చెప్పుకొవాలి.

ఈ సీజన్‌లో SRH జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సీజన్లో 287 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన హైదరాబాద్ జట్టు.. ఈ సీజన్ లో 300 మార్కును రీచ్ అవుద్దా లేదా అనే దానిపై క్రికెట్ అభిమానుల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో నిన్న ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచు (Practice match)లో బ్యాటర్లు ఉచకొత కోశారు. హెడ్, నితీష్, క్లాసిన్ వంటి ప్లేయర్లు లేనప్పటికి యువ బ్యాటర్లు అయిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఏ వర్మలు బౌలర్లపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ప్లేయర్లు రెండు జట్లుగా విడిపోయి ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా.. మొదట బ్యాటింగ్ చేసిన SRH- A జట్టు 19. 4 ఓవర్లలో ఏకంగా 260 పరుగుల భారీ స్కోరు చేసింది.

అనంతరం 261 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన SRH-B టీమ్ కూడా ఏమాత్రం తగ్గకుండా.. ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో SRH- A జట్టు విజయం సాధించింది. కాగా ఈ ప్రాక్టీస్ సెషన్ మ్యాచ్ కి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు ఉత్సాహంలో మునిగిపోతున్నారు. కీలక ప్లేయర్లు హెడ్, క్లాసిన్, నితీష్ లేకుండా ఇంత విద్వంసం చేస్తున్నారంటే వారు కూడా జాయిన్ అయితే ఇతర జట్లు పరిస్థితి ఏంటని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరీ ఈ నెల 22 నుంచి ప్రారంభం అయ్యే నిజమైన మ్యాచుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ విధంగా రాణిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Full View


Similar News