Virat Kohli: 'ఒంటరిగా కూర్చుని బాధపడటం ఇష్టం లేదు..' బీసీసీఐ 'ఫ్యామిలీ రూల్‌'పై విరాట్‌ కోహ్లీ షాకింగ్‌ కామెంట్స్!

Virat Kohli: కుటుంబ సభ్యుల హాజరును పరిమితం చేయడంపై బీసీసీఐ(BCCI) నిర్ణయంపై విరాట్ కోహ్లీ(Virat Kohli) అసంతృప్తి వ్యక్తం చేశాడు

Update: 2025-03-16 07:29 GMT

దిశ, వెబ్ డెస్క్: Virat Kohli: కుటుంబ సభ్యుల హాజరును పరిమితం చేయడంపై బీసీసీఐ(BCCI) నిర్ణయంపై విరాట్ కోహ్లీ(Virat Kohli) అసంతృప్తి వ్యక్తం చేశాడు. టూర్‌లలో కుటుంబ మద్దతు ఆటగాళ్ల మానసిక స్థిరత్వానికి కీలకంగా ఉంటుందని చెప్పాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటగాళ్లకు కుటుంబం మద్దతుగా ఉండటం ఎంత కీలకమో వివరించాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ(Virat Kohli), బీసీసీఐ కొత్త నియమంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. టూర్‌ల సమయంలో కుటుంబ సభ్యుల హాజరుకు పరిమితులు పెట్టడాన్ని కోహ్లీ(Virat Kohli) అంగీకరించడంలేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో 1-3 తేడాతో ఓటమి తర్వాత బీసీసీఐ(BCCI) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల ప్రకారం, 45 రోజులకంటే ఎక్కువ నిడివి గల టూర్‌లలో మొదటి రెండు వారాల తరువాతే ఆటగాళ్ల కుటుంబ సభ్యులు జాయిన్ కావచ్చు. అలాగే ఈ రూల్‌ కూడా 14 రోజులకు మాత్రమే పరిమితం.

ఇటు టూర్‌ల సమయంలో కుటుంబ సభ్యులు ఉండటం ఆటగాళ్ల మానసిక స్థితిపై చాలా ప్రభావం చూపుతుందని కోహ్లీ (Virat Kohli)అభిప్రాయపడ్డాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు, మ్యాచ్‌లు గెలిపించాల్సిన బాధ్యత ఉన్నప్పుడు, ఆటగాళ్లకు మానసిక స్థిరత్వం ఎంతో అవసరం. అలాంటప్పుడు కుటుంబంతో గడిపే సమయం వారిని మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంచుతుందని కోహ్లీ నమ్మకం.

ఇక ఇటీవల దుబాయ్‌(Dubai)లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. పాకిస్తాన్‌పై సెంచరీ, ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌లో 84 పరుగులు చేయడం ద్వారా తన సత్తా చాటాడు. ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని మూడోసారి సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని కోహ్లీ తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఇటు టోర్నమెంట్ సమయంలో అనుష్క శర్మ(anushka sharma) స్టేడియంలో కనిపించటం, జట్టును సపోర్ట్ చేయడం, ఆత్మస్థైర్యం కలిగించటం లాంటి అంశాలు వైరల్ అయ్యాయి. రోహిత్ శర్మ భార్య రితికా(ritika), కుమార్తె సమైరా కూడా మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చారు. ఆటగాళ్లు ఒంటరిగా ఉండకుండా, వారి కుటుంబ సభ్యుల సహాయంతో ఒత్తిడిని ఎదుర్కొనగలుగుతున్నారని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

Tags:    

Similar News