రాయుడు విధ్వంసకర ఇన్నింగ్స్.. ఇండియా మాస్టర్స్‌దే టైటిల్

Update: 2025-03-16 19:00 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్లు అదరగొట్టారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా మాస్టర్స్ ప్రారంభ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. రాయ్‌పూర్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో వెస్టిండీస్ మాస్టర్స్‌పై 6 వికెట్ల తేడాతో నెగ్గి విజేతగా నిలిచింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 రన్స్ చేసింది. సిమన్స్(57), డ్వానే స్మిత్(45) సత్తాచాటారు. భారత బౌలర్లు వినయ్ కుమార్ 3 వికెట్లు, నదీమ్ 2 వికెట్లతో రాణించి ప్రత్యర్థిని మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు. 149 పరుగుల లక్ష్యాన్ని ఇండియా మాస్టర్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. అంబటి రాయుడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 50 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 రన్స్ చేశాడు. కెప్టెన్ సచిన్ టెండూల్కర్(25) కీలక రన్స్ జోడించాడు. యువరాజ్ సింగ్(13 నాటౌట్), స్టువర్ట్ బిన్నీ(16 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు.


Tags:    

Similar News