Mohammad Shami : హోలీ వేడుకల్లో షమీ కూతురు.. మత పెద్దల వార్నింగ్

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీ(Mohammad Shami) మరో వివాదంలో చిక్కుకున్నారు.

Update: 2025-03-16 14:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీ(Mohammad Shami) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కూతురు హోలీ వేడుకల్లో(Holi Celebrations) పాల్గొనగా.. దీనిపై మతపెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది చట్టవిరుద్ధమని.. షరియత్‌(Shariat)కు వ్యతిరేకమని ఆల్‌ ఇండియా ముస్లిం జమాత్‌ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్‌ రజ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మాయి అవగాహన లేకుండా హోలీ ఆడితే అది నేరం కాదని.. అవగాహన ఉండి హోలీ ఆడితే షరియత్‌కు వ్యతిరేకమన్నారు. రంజాన్‌(Ramzan) సందర్భంగా షమీ ఉపవాసం ఉండక మొదట పాపం చేశాడని.. ఇప్పుడు అతని కూతురు హోలీ ఆడుతోందని.. ఇస్లాం సూత్రాలు పాటించాలని తాను షమీకి గతంలో సూచనలు చేశానని రజ్వీ పేర్కొన్నారు.

అయినప్పటికీ షమీ కూతురు హోలీ ఆడుతున్న వీడియో బయటకు వచ్చిందని.. షరియాలో లేని పనులు పిల్లలతో చేయనివ్వొద్దని షమీ, అతని కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. హోలీ హిందువులకు పెద్ద పండగా అని, ముస్లింలు జరుపుకోవద్దని, షరియా తెలిసిన తర్వాత ఎవరైనా హోలీ జరుపుకుంటే అది పాపమన్నారు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ సాధించిన భారత జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. కెప్టెన్‌, ఇతర ప్లేయర్‌, మహ్మద్‌ షమీకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానన్నారు. పవిత్ర రంజాన్‌ మాసంలో షమీ ఉపవాసం ఉండకపోవడం పాపం చేశాడని.. షరియత్‌ను అగౌరవపరచొద్దని కుటుంబ సభ్యులను కోరినట్లు రజ్వీ తెలిపారు.

ఈ నెల 6న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ(ICC Champions Trophy)లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో షమీ కూల్‌డ్రింక్‌ తాగుతూ కనిపించిన విషయం తెలిసిందే. షరియత్‌ దృష్టిలో అతను నేరస్థుడని రజ్వీ విమర్శించారు. షమీ అలా చేసి ఉండకూడదని.. షరియత్‌ నియమాలను పాటించడం ముస్లింల అందరి బాధ్యత అన్నారు. ఇస్లాంలో ఉపవాసం తప్పనిసరని.. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఉపవాసం ఉండకపోతే ఇస్లామిక్ చట్టం ప్రకారం అతన్ని పాపిగా పరిగస్తారని.. క్రికెట్ ఆడడం తప్పు కాదని.. కానీ, మతపరమైన బాధ్యతలను నెరవేర్చాలని.. షరియత్‌ నియమాలను పాటించాలని సూచించారు.

Tags:    

Similar News