Nitish Kumar Reddy : నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ చూసి..తండ్రి కేరింతలు

అస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్(Border Gavaskar Series) నాల్గవ టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రాణించిన తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కెరీర్ లో తొలి సెంచరీ (First century)సాధించడం సర్వత్రా ప్రశంసలందుకుంటుంది.

Update: 2024-12-28 07:45 GMT

దిశ, వెబ్ డెస్క్: అస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్(Border Gavaskar Series) నాల్గవ టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రాణించిన తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కెరీర్ లో తొలి సెంచరీ (First century)సాధించడం సర్వత్రా ప్రశంసలందుకుంటుంది. ఎనిమిదవ స్థానంలో వచ్చి సహచరుడు వాషింగ్టన్ సుందర్ (50)తో కలిసి ఏకంగా తను 171బంతుల్లో సెంచరీ(105) కొట్టి భారత జట్టును ఫాలో ఆన్ గండం నుంచి తప్పించాడు. ఈ మ్యాచ్ చూసేందుకు ఆస్ట్రేలియా మెల్ బోర్న్ స్టేడియంకు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి కొడుకు సెంచరీని ప్రత్యక్షంగా చూసి టీమ్ ఇండియా ప్రేక్షకులతో పాటు తను కూడా కేరింతలు కొట్టాడు. నితీష్ 99పరుగుల వద్ధ బూమ్రా అవుటవ్వడం..కమిన్స్ ఆ ఓవర్ లో మిగిలిఉన్న మూడు బంతులను సిరాజ్ ఆడలేకపోతే కొడుకు సెంచరీ పూర్తికాదేమోనన్న అనుమానాలతో ప్రేక్షకులతో పాటు తండ్రి కూడా టెన్షన్ పడ్డారు. సిరాజ్ ఆ మూడు బంతులు విజయవంతంగా ఆడగా, తదుపరి బోలాండ్ ఓవర్ లో నితీష్ కుమార్ రెడ్డి ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. కొడుకు సెంచరీ చూసిన ముత్యాల్ రెడ్డి ఆనంద బాష్పాలతో అభినందిస్తూ ప్రేక్షకులతో పాటు చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టి తన ఆనందం వ్యక్తం చేశాడు.

మారుమ్రోగుతున్న నితీశ్ రెడ్డి పేరు...

ఇలా విదేశీ గడ్డపై సత్తాచాటి తన కెరీర్ లో తొలి సెంచరీ సాధించాడు నితీష్. దీంతో ఒక్కసారిగా తెలుగు ఆల్ రౌండర్ పేరు మారుమోగిపోతోంది. ఎవరీ నితీష్ కుమార్ రెడ్డి? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మన తెలుగు యువకెరటం నితీష్ వ్యక్తిగత వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నితీష్ కుమార్ రెడ్డి స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం. చిన్నప్పటి నుండే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న అతడికి కుటుంబ ప్రోత్సాహం కూడా లభించింది. దీంతో విశాఖ గల్లీల్లో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న అతడు ఇప్పుడు విదేశీ గడ్డపై సెంచరీ మోత మోగించాడు.

బాక్సింగ్ డే టెస్టులో తొలి సెంచరీ సాధించిన తెలుగు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి పేరు మారుమోగిపోతోంది. ఎవరీ నితీష్ కుమార్ రెడ్డి? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. విశాఖలో నివసించే సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి విశాఖలోని హిందుస్థాన్ జింక్ లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. తల్లి గృహిణి. కొడుకు క్రికెట్ పట్ల ఇష్టం పెంచుకోవడంతో తల్లిదండ్రులు కూడా అతడిని మనకు ఆటలు ఎందుకని నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించారు. కొడుకు కెరీర్ కోసం ముత్యాలరెడ్డి తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు. ఆల్ రౌండర్ గా ఎదుగుతున్న నితీష్ ప్రతిభను గుర్తించిన టీమిండియా మాజీ ప్లేయర్ ఎమ్మెస్కే ప్రసాద్ కడపలోని ఏసిఏ అకాడమీలో చేర్పించి ప్రోత్సహించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రా తరఫున ఆడే అవకాశం నితీష్ కుమార్ రెడ్డికి దక్కింది. ఆల్ రౌండర్ గా ఇండియా అండర్ 19 బీ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఇతడు 566 పరుగులు చేశాడు.

ఆంధ్ర తరుపున రంజీ ట్రోఫీలో 7 మ్యాచ్‌లు ఆడి 366 పరుగులు చేశారు. అందులో ఒక సెంచరీ కొట్టాడు. ఆల్ రౌండర్ ప్రదర్శనతో సన్ రైజర్స్ టీం మేనేజ్ మెంట్ ద‌ృష్టిలో పడటంతో నితీశ్ ను వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. ఐపీఎల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నితీశ్ ధనాధన్ ఇన్పింగ్స్ తో స్టార్ గా మారాడు. ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో నేరుగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ కు ఎంపికయ్యాడు. నాల్గవ టెస్టులో సెంచరీ సాధించి సంచలనం రేపిన నితీష్ రెడ్డి తొలి టెస్టు తొలి రెండు ఇన్నింగ్స్ లలో 41, 38 నాటౌట్, తదుపరి రెండు, మూడు టెస్టుల్లో 42,42,16పరుగులు సాధించాడు. నాల్గవదైన బాక్సింగ్ డే టెస్టులో ఎనిమిదవ నంబర్ బ్యాటర్ గా దిగి టీమ్ ఇండియా తరుపున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు. అంతకుముందు ఎనిమిదవ నెంబర్ లో అత్యధిక స్కోరు అనిల్ కుంబ్లే(87) పేరిట ఉన్న రికార్డును నితీష్ బద్ధలు కొట్టాడు.

Tags:    

Similar News