ఉమెన్స్ డే.. సచిన్ టెండుల్కర్ ఎమోషనల్ ట్వీట్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ ఎమోషనల్ ట్వీట్ అభిమానులతో పంచుకున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ ఎమోషనల్ ట్వీట్ అభిమానులతో పంచుకున్నారు. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో మహిళల పెరుగుదలకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అయితే 2008లో, 26/11 తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచిందని, ఆ సమయంలో తాను ఒక మహిళా గ్రౌండ్ స్టాఫ్ మెంటర్‌తో ఆ ఉద్వేగభరితమైన క్షణాలను ఆమెతో పంచుకున్నానని తెలిపారు. ఆ క్షణం తనకు చాలా ప్రత్యేకమైందని గుర్తుచేశారు.
తర్వాత 2024 లో మరో మహిళ, జసింత కళ్యాణ్ దేశానికి మొదటి మహిళా పిచ్ క్యూరేటర్‌గా వచ్చిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి రంగాల్లోకి చాలా మందికి రావడానికి ఆమె ఒక హోప్ అని తెలిపారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రంగాల్లో మహిళలు అడ్డంకులను చేదించేలా.. ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.