Rohit Sharma: ఐపీఎల్‌కు ముందు ఫ్యామిలీతో అక్కడకు వెళ్లిన రోహిత్ శర్మ.. పోస్ట్ వైరల్
టీమిండియా టెస్టు జట్టు రోహిత్ శర్మ (rohitsharma) రీసెంట్‌గానే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) లో టీమిండియాను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా టెస్టు జట్టు రోహిత్ శర్మ (rohitsharma) రీసెంట్‌గానే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ- 2025 (ICC Champions Trophy) లో టీమిండియాను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నీలో ఇండియా ఐదింటికి ఐదూ విజయంగా నిలిచి.. ట్రోఫీని ముద్దాడింది. ఏకంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో ఘన విజయం సాధించారు.
ఇప్పటివరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని ఘనతను రోహిత్ శర్మ సాధించాడని చెప్పుకోవచ్చు. అయితే రోహిత్ శర్మ ఐపీఎల్ కి ముందు రిలాక్స్ కోసం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోది. ఛాంపియన్స్ ట్రోఫ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ తన భార్య అండ్ కుమార్తెతో కలిసి మాల్దీవ్స్‌కు చెక్కేశాడు.
షెడ్యూల్‌కు ముందు రెస్ట్ తీసుకుంటూ తన కుంటుంబంతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నాడు. భార్య రితికా సజ్దే (Ritika Sajde), కుమార్తె సమైరా (Samaira)తో కలిసి మాల్దీవ్స్‌లో ఫొటో షూట్ కూడా చేశాడు. భారత జట్టును విజయ తీరానికి చేర్చిన కెప్టెన్ రోహిత్ శర్మ సముద్ర తీరాన తన ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా గడుపుతున్నాడు.
భార్యాకుమార్తెతో కలిసి దిగిన ఫొటోలు రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికన అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోలకు ‘సన్ సీ సాండ్ .. డాక్టర్ ఆదేశించినట్లే ’ అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం రోహిత్ పోస్ట్ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.
ఇక ఈ రెండు నెలలు గట్టి షెడ్యూల్డ్‌కు ముందు తనను తాను రీఛార్జ్ చేసుకోవడానికి ఫ్యామిలీతో టూర్ వేశాడంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీలోని ముఖ్య సభ్యులందరూ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. ఇక ఐసీఎల్ ముగిసిన వెంటనే.. భారత జట్టు ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం యూరప్ వెళ్లనుందని టాక్.