నాలుగో టెస్టులో ఓటమి.. రోహిత్ శర్మ చెత్త రికార్డు
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ సిరీస్‌లో 1-2zతో వెనుకబడింది. తాజా ఓటమితో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఓ సీజన్‌లో అత్యధిక టెస్టు ఓటములు పొందిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఈ ఏడాది రోహిత్ సారథ్యంలో టీమిండియా 6 టెస్టు మ్యాచ్‌ల్లో ఓడింది. జనవరిలో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైన భారత్.. న్యూజిలాండ్‌తో మూడు టెస్టులను కోల్పోయింది. ఆస్ట్రేలియా చేతిలో రెండు టెస్టుల్లో ఓటమి తప్పలేదు. ఇంతకుముందు 1999-2000లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో భారత్ ఐదు టెస్టులను కోల్పోయింది. తాజాగా సచిన్ పేరిట ఉన్న చెత్త రికార్డును రోహిత్ మూటగట్టుకున్నాడు. అయితే, ఈ సీజన్‌లో భారత్ టెస్టుల్లో ఓటముల కంటే విజయాలే ఎక్కువ నమోదు చేసింది. మొత్తం 15 టెస్టుల ఆడగా.. అందులో 8 విజయాలు సాధించింది. ఆరు మ్యాచ్‌ల్లో ఓడగా.. ఒకటి డ్రాగా ముగిసింది.