IND vs WI: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ..

ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగింది.

Update: 2023-07-20 16:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, యశస్వీ జైశ్వాల్‌ మరోసారి అద్బుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి 23 ఓవర్లు ముగిసే సరికి తొలి వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్‌ శర్మ(88 బంతుల్లో 61 నాటౌట్‌), యశస్వీ జైశ్వాల్‌(50) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు.

వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో 2,000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి భారత ఆటగాడిగా రోహిత్‌ రికార్డులకెక్కాడు. 45 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు డబ్ల్యూటీసీలో 25 మ్యాచ్‌లు (40) ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్‌ 2017 పరుగులు చేశాడు. ఈ జాబితలో రోహిత్‌ తర్వాత స్ధానంలో భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లి(1942) ఉన్నాడు.


Similar News