IPL 2024: ఆర్సీబీ కీలక నిర్ణయం.. ఇద్దరు లెజెండ్స్‌పై వేటు!

IPL 2024 ఐపీఎల్‌ సీజన్‌ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది.

Update: 2023-07-17 12:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2024 ఐపీఎల్‌ సీజన్‌ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. టీం డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ మైక్ హెసాన్, హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఇద్దర్నీ తొలగించేయాలని డిసైడ్ అయిందట. గత ఐదేళ్లుగా ఈ ఫ్రాంచైజీ కోచింగ్ యూనిట్‌కు వీళ్లిద్దరూ మూలస్తంభాలుగా ఉన్నారు. ఈ ఇద్దరి మార్గనిర్దేశకత్వంలో ఆర్సీబీ మూడుసార్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరింది. కానీ ట్రోఫీ మాత్రం ముద్దాడలేకపోయింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ అయితే ఏకంగా తన హెడ్‌ కోచ్‌ను మార్చేసింది. ఆ జట్టు ఆండీ ఫ్లవర్‌ స్థానంలో ఆసీస్‌ మాజీ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ కూడా లక్నో బాటలోనే నడవాలని భావిస్తుంది.

ఐపీఎల్ మొదలై 16 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేదు. స్టార్లతో కూడిన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్నా కూడా ఆర్సీబీ ట్రోఫీ నెగ్గకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన ఈ టీం.. ప్లేఆఫ్స్ కూడా చేరలేదు. 2009, 2011 సీజన్లలో మాత్రం ఆ జట్టు కొందరు స్టార్ల పుణ్యమా అని రన్నరప్‌గా నిలిచింది.


Similar News