Ind Vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. బౌలింగ్‌ విభాగంలో స్వల్ప మార్పులు!

మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ (New Zealand) తో బెంగళూరు (Bengaluru) వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా (Team India) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Update: 2024-10-22 09:41 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ (New Zealand) తో బెంగళూరు (Bengaluru) వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా (Team India) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో సిరీస్‌లో భారత్ 1-0తో వెనుకంజలో కొనసాగుతోంది. అయితే, రెండు టెస్ట్‌లో ఎలాగైనా విజయం సాధించాలని జట్టు కృత నిశ్చయంతో ఉంది. గురువారం నుంచి పూణే వేదికగా ప్రారంభం కాబోతున్న రెండో టెస్ట్‌లో తుది జట్టులో బౌలింగ్ విభాగంలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

హైదరాబాద్ స్టార్ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj)‌ను తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వదేశంలో ఇప్పటికే వరకు 13 టెస్ట్‌లు ఆడిన సిరాజ్ కేవలం 19 వికెట్లను మాత్రమే తీశాడు. అదేవిధంగా విదేశాల్లో ఆడిన 17 టెస్టుల్లో 61 వికెట్లను నేలకూల్చాడు. అదేవిధంగా కివీస్‌ (Kiwis)తో జరిగిన తొలి టెస్ట్‌లో మొత్తం 2 వికెట్లను మాత్రమే తీసుకున్నాడు. దీంతో అతడిపై వేటు ఖాయమనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఒకవేళ మహమ్మద్ సిరాజ్‌ (Mohammed Siraj)ను నుంచి తుది జట్టు నుంచి తప్పిస్తే.. మరో పేసర్ ఆకాశ్ దీప్‌ (Akash Deep)కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అతడు ఆడిన 3 టెస్ట్‌ మ్యాచ్‌లలో ఏకంగా 8 వికెట్లను పడగొట్టాడు. అంతా అనుకున్నట్లుగా జరిగితే.. రెండు టెస్ట్‌లో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు బౌలింగ్ పార్ట్‌నర్‌గా ఆకాశ్ దీప్‌ను చూడవచ్చు. 

Tags:    

Similar News