Ravichandran Ashwin: నా రిటైర్మెంట్‌కు ఎవరూ బాధ్యులు కాదు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
బోర్డర్-గవాస్కర్ సిరీస్ 2024లో భాగంగా మరో రెండు టెస్ట్‌లు మిగిలి ఉండగానే భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించారు.
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ సిరీస్ 2024లో భాగంగా మరో రెండు టెస్ట్‌లు మిగిలి ఉండగానే భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించారు. ఊహించని ఈ పరిణామంతో టీమిండియా ఫ్యాన్స్‌తో పాటు జట్టులోని సహచరులు కూడా షాక్‌కు గురయ్యారు. అదేవిధంగా భారత మాజీ ఆటగాళ్లు సైతం అశ్విన్ రిటైర్మెంట్ పట్ల అశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన రిటైర్మెంట్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరిపైనా కోపం లేదని అన్నాడు. తన రిటైర్మెంట్‌కు ఎవరూ బాధ్యులు కాదని క్లారిటీ ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్‌లో 537 వికెట్లు తీశానని.. అంత కంటే ఆనందం ఇంకేముంటుందని అన్నారు. ఇక ముందు కూడా క్రికెట్‌తో తన బంధం ముడిపడి ఉంటుందని అశ్విన్ భావోద్వేగంతో వెల్లడించారు.
కాగా, కెరీర్‌లో మొత్తం 106 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 537 వికెట్లను పడగొట్టాడు. అందులో 5 వికెట్ హాల్ 37 సార్లు, 10 వికెట్ హాల్ 8 సార్లు సాధించాడు. బ్యాటింగ్‌లో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక వన్డే ఫార్మాట్‌లో 116 మ్యాచ్‌లు ఆడి 156 వికెట్లను నేలకూల్చాడు. ఇక టీ20ల విషయానికి వస్తే.. 65 మ్యాచ్‌లు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 72 వికెట్లు తీసుకున్నాడు.