DC vs LSG : ఐపీఎల్ లో ఢిల్లీ తొలి బోణీ

ఐపీఎల్(IPL- 2025) లో తొలి మ్యాచ్ లోనే ఢిల్లీ(DC) బోణి కొట్టింది.

Update: 2025-03-24 17:56 GMT
DC vs LSG : ఐపీఎల్ లో ఢిల్లీ తొలి బోణీ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్(IPL- 2025) లో తొలి మ్యాచ్ లోనే ఢిల్లీ(DC) బోణి కొట్టింది. లక్నో(LSG)పై మూడు బాల్ మిగిలి ఉండగానే ఒక వికెట్ తేడాతో విజయం సొంతం చేసుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ - లక్నో సూపర్ జెయింట్స్(DC vs LSG) మధ్య మ్యాచ్ విశాఖపట్నం(Vishakhapatnam)లోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం(YSR Cricket Stadium)లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి లక్నో బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి లక్నో 209 పరుగులు చేయగా.. తొలుత తడబడిన ఢిల్లీ.. ఎట్టకేలకు మరో మూడు బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించింది. లక్నో జట్టులో నికోలస్ పూరన్ 75, మిచెల్ మార్ష్ 72 పరుగులు చేయగా... ఢిల్లీ అశుతోష్ 66, విప్రాజ్ 39 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. లక్నో జట్టులో శార్దూల్, మారన్, దిగవేష్, బిస్నోయ్ తలా రెండు వికెట్లు తీశారు. ఢిల్లీ జట్టులో స్టార్క్ 3, కులదీప్ , ముకేష్, విప్రాజ్ చెరో వికెట్ తీశారు.

Tags:    

Similar News