Rohit Sharma : రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ముగిశాక రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ నిర్ణయం తీసుకుంటాడేమో అని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.

Update: 2024-12-30 09:22 GMT

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ముగిశాక రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ నిర్ణయం తీసుకుంటాడేమో అని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. సోమవారం ఆయన ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడారు.‘కోహ్లీ మరి‌కొన్ని రోజులు క్రికెట్ ఆడొచ్చు. అతను ఈ రోజు ఔట్ అయిన విధానాన్ని మర్చిపోండి. విరాట్ 3 నుంచి 4 ఏళ్లు క్రికెట్ ఆడగలడు అని భావిస్తున్నా. టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ ఫుట్ వర్క్ గతంలోలాగా లేదు. బాల్‌ను అందుకోవడంలో విఫలం అవుతున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో గెలవాలనే తపన కనిపించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బ్యాటింగ్ చేసేటప్పుడు అతని కళ్లల్లో ఆ కసిని చూశాను. రోహిత్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆస్ట్రేలియా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. రోహిత్ ఎటాక్ చేసేందుకు యత్నించాడు. కానీ ఆసీస్ బౌలర్లు అతన్నీ ఔట్ చేశారు.’ అని రవిశాస్త్రి అన్నాడు. 

Tags:    

Similar News