ఇంకా మెరుగుపడాలి.. మా ఓటమికి కారణమదే : Rahul Dravid

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2తో టీ20 సిరీస్‌ను విండీస్‌ కైవసం చేసుకుంది.

Update: 2023-08-14 10:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2తో టీ20 సిరీస్‌ను విండీస్‌ కైవసం చేసుకుంది. ఫ్లోరిడా వేదికగా ఆఖరి టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన వెస్టిండీస్.. 6 ఏళ్ల తర్వాత టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం  టీమిండియా హెడ్‌ కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగానే సిరీస్‌ను కోల్పోయామని ద్రవిడ్‌ తెలిపాడు. ''ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు, ఐదో టీ20లో మేము కొన్ని తప్పులు చేశాం. ఈ మూడు మ్యాచ్‌ల్లో కూడా బ్యాటింగ్‌ బాగా చేయలేదు. అయితే జట్టు మొత్తం యువ ఆటగాళ్లతో కూడి ఉన్నది. కాబట్టి కొన్నిసార్లు మనం ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు ఛాన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించకున్నాం'' అని ద్రావిడ్ తెలిపారు.

అదేవిధంగా సరికొత్త కాంబనేషన్స్‌ను కూడా ప్రయత్నించాం. ఈ విషయంలో అయితే కొంతమెరకు మేము విజయం సాధించాం. జైశ్వాల్‌, తిలక్‌ వంటి యువ ఆటగాళ్లు తమ సత్తా చాటారు. నాలుగో టీ20లో జైశ్వాల్‌ తన టాలెంట్‌ చూపించాడు. తిలక్‌ కూడా బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. అయితే విండీస్‌ పర్యటనలో మాకు కొన్ని పాజిటివ్‌ అంశాలతో పాటు ప్రతికూల విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా మా బ్యాటింగ్‌ డెప్త్‌ను ఇంకా పెంచుకోవాలి. బౌలింగ్‌ అయితే మరి అంత బలహీనంగా లేదు. మాకు ముందు ఇంకా చాలా సవాళ్లు ఎదురుకానున్నాయి. అందుకు తగట్టు సిద్దం కావడమే మా పని అని" ద్రవిడ్‌ పేర్కొన్నాడు.


Similar News