ఛాంపియన్స్ ట్రోఫీతో పాకిస్తాన్‌కు భారీ నష్టం.. ఎంత ఖర్చు చేస్తే.. ఎంతొచ్చిందో తెలుసా?

పాకిస్తా్న్ క్రికెట్ బోర్డు(PCB)కు భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఆ దేశానికి పీసీబీ(Pakistan Cricket Board) మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది.

Update: 2025-03-17 15:18 GMT
ఛాంపియన్స్ ట్రోఫీతో పాకిస్తాన్‌కు భారీ నష్టం.. ఎంత ఖర్చు చేస్తే.. ఎంతొచ్చిందో తెలుసా?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB)కు భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఆ దేశానికి పీసీబీ(Pakistan Cricket Board) మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ట్రోఫీ(Champions Trophy-2025) ఈసారి పాకిస్తాన్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. భారత్‌కు సంబంధించిన మ్యాచులు మినహాయించి మిగిలిన మ్యాచులన్నీ ఆ దేశంలోనే జరిగాయి. అయితే.. ఈ ఐసీసీ టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ దాదాపు రూ.869 కోట్లు ఖర్చు చేస్తే.. రూ.52 కోట్లే తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.800 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు సమాచారం.

దీంతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న దేశానికి క్రికెట్ బోర్డు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిందని ఆ దేశ ప్రభుత్వ పెద్దలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ మహా టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. గ్రూపు-బీ నుంచి భారత్, న్యూజిలాండ్ వెళ్లగా.. ఫైనల్‌లో భారత్ కప్ సాధించింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డుపై ప్రభుత్వ పెద్దలతో పాటు ఆ దేశ ప్రజలు సైతం దుమ్మెత్తిపోస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News