టీమిండియా ప్రదర్శనపై పీసీబీ ప్రెసిడెంట్ Ramiz Raja ఆసక్తికర కామెంట్స్
ఆసియా కప్‌లో భారత్ జట్టు ప్రదర్శనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రమీజ్ రాజా - Ramiz Raja Explains Why Rohit Sharma & Co Failed at Asia Cup 2022
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌లో భారత్ జట్టు ప్రదర్శనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రమీజ్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2022 సూపర్ 4లో భారత్ నిష్క్రమించడానికి కారణం జట్టులో చాలా మార్పులు చేయడమేనని రమీజ్ రాజా పేర్కొన్నారు. ప్లేయర్స్ గాయపడితే తుది జట్టులో మార్పులు తప్పదు. కానీ, విజయం సాధిస్తున్నప్పుడు విన్నింగ్ కాంబినేషన్‌ని మార్చాల్సిన అవసరం ఏముంటుంది..? కానీ భారత్ అలా ఆలోచించలేదు. టీమిండియా తుది జట్టులో చాలా మార్పులు చేశారు. రిజర్వ్ బెంచ్ బలంగా లేనప్పుడు వారితో ప్రయోగాలు చేసి మూల్యం చెల్లించుకున్నారు అని రమీజ్ రాజా అన్నారు.
ఆసియా కప్‌లో భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తుది జట్టులో మార్పులు చేయడం గమనార్హం. రవీంద్ర జడేజా గాయపడటంతో పాటు టీ20 ప్రపంచకప్ కోసం ప్రయోగాలు చేయడం టీమిండియా కొంపముంచాయి. లీగ్ దశలో వరుస విజయాలు అందుకున్న రోహిత్ సేన.. కీలక సూపర్ 4 లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి ఫైనల్ చేరే అవకాశాలను కోల్పోయింది.