గిల్‌పై మాజీ బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు.. మొదటిసారి చూసినప్పుడు మైండ్‌లో అదే అనుకున్నాడట
శ్రీలంక పర్యటనలో భారత టీ20 జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక పర్యటనలో భారత టీ20 జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. తాజాగా గిల్‌పై మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసలు కురిపించాడు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. గిల్ ఏదో ఒక రోజు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ అవుతాడని జోస్యం చెప్పాడు. ‘నెట్స్‌లో అతన్ని మొదటి సారి చూసినప్పుడు అందరిలానే అనుకున్నా. చాలా మంది అతనిలో ఉన్న స్పెషల్ టాలెంట్ గురించి చెప్పారు. తొలిసారి అతను ఆడేటప్పుడు అతని ప్రతిభను చూశా. అప్పుడు ‘ఈ కుర్రాడు చాలా టాలెంటెండ్’ అనిపించింది. అతనికి అతని ఆట గురించి తెలుసు. వేర్వేరు సందర్భాల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో తెలుసు. సవాళ్లకు అతను దూరంగా ఉండడు.’ అని తెలిపాడు. కోహ్లీ, రోహిత్ మాదిరిగానే కెప్టెన్సీ గిల్ ప్రదర్శనను మెరుగుపరుస్తుందని చెప్పాడు. ‘ఇంకా అతను కెప్టెన్ కాలేదు. లీడర్‌షిప్ గ్రూపులో ఉంటే అతని నుంచి ఉత్తమమైనవి పొందవచ్చని నేను కచ్చితంగా చెప్పగలను. గిల్ ఏదో ఒక రోజు మూడు ఫార్మాట్లలో భారత జట్టును నడిపిస్తాడు.’ అని చెప్పుకొచ్చాడు.