దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌పై టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల జల్లు కురిపించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆయన అత్యుత్తమ బౌలరని కొనియాడాడు. టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిదిల కంటే కూడా మిచెల్ స్టార్క్ మేటి బౌలరని దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో స్టార్క్ సత్తా చాటాడు.
తొలి వన్డేల్లో 3 వికెట్లు తీయగా.. రెండో వన్డేలో 5 వికెట్లతో రోహిత్ సేన పతనాన్ని శాసించాడు. మిచెల్ స్టార్క్ వల్లే భారత్ ఓటమిపాలైందని చెప్పాడు. 'బెస్ట్ వైట్ బాల్ బౌలర్ ఎవ్వరంటే చాలా మంది జస్‌ప్రీత్ బుమ్రా, షాహీన్ ఆఫ్రిది పేర్లు చెబుతారు. కానీ ఈ తరంలో బెస్ట్ వైట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఒక్కడే అని అన్నారు. వన్డే వరల్డ్ కప్‌లో మిచెల్ స్టార్క్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు పెద్ద సవాలే అని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు.