ప్రపంచ ఆల్ రౌండర్ షకీబ్ పై హత్య కేసు

క్రికెట్లో ప్రపంచ ఆల్ రౌండర్ గా పేరు పొందిన బంగ్లా క్రికెటర్ షకీబ్ ఆల్ హాసన్ మీద హత్య కేసు నమోదైంది.

Update: 2024-08-23 11:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్లో ప్రపంచ ఆల్ రౌండర్ గా పేరు పొందిన బంగ్లా క్రికెటర్ షకీబ్ ఆల్ హాసన్ మీద హత్య కేసు నమోదైంది. ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లలో రూబెల్ అనే యువకుడు మరణించాడు. తన కుమారుని మరణానికి షేక్ హసీనా ప్రభుత్వమే కారణమంటూ అతని తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో మొత్తం 154 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. 28వ నిందితుడిగా షకీబ్ పేరు నమోదైంది. గత ఎన్నికల్లో అవామి లీగ్ పార్టీలో ఎంపీగా గెలిచిన షకీబ్, బంగ్లా అల్లర్ల విషయంలో మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం రద్దవడంతో ఎంపీ పదవి కోల్పోయి, కెనడాకు వెళ్ళిపోయాడు. అటు నుండి పాక్ కు వెళ్ళి నెక్స్ట్ జరిగే టెస్ట్ సిరీస్ కు ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ, అందులోనూ చట్టసభ సభ్యునిగా బంగ్లా అల్లర్లపై ఎందుకు స్పందిచలేదని, ఆ మౌనం వెనుక కారణం చెప్పాలని ఆ దేశంలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బంగ్లాలోని ప్రముఖ నటుడు ఫర్దూస్ అహ్మద్ కూడా ఈ కేసులో 55వ నిందితుడిగా ఉన్నాడు.


Similar News