Eng vs Aus: రాణించిన అలెక్స్ క్యారీ..రెండో వన్డేలో ఇంగ్లండ్‌పై ఆసీస్ ఘన విజయం
హెడింగ్లీ(Headingley) వేదికగా శనివారం ఇంగ్లండ్(England)తో జరిగిన రెండో వన్డే(Second ODI)లో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది.
దిశ, వెబ్‌డెస్క్:హెడింగ్లీ(Headingley) వేదికగా శనివారం ఇంగ్లండ్(England)తో జరిగిన రెండో వన్డే(Second ODI)లో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది. 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 44.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది.కంగారూల తరుపున వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(74 పరుగులు; 8 ఫోర్లు,3 సిక్సర్లు) కెప్టెన్ మిచెల్ మార్ష్ (60 పరుగులు; 6 ఫోర్లు,3 సిక్సర్లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ 3 వికెట్లు తీయగా ఆదిల్,బెథెల్,పాట్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్, ఆసీస్ బౌలర్లు విజృభించడంతో 40.2 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో జేమీ స్మిత్ (49 పరుగులు; 6 ఫోర్లు,2 సిక్సర్లు) టాప్‌స్కోరర్‌గా నిలిచారు.ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3,హేజిల్‌వుడ్, హార్డీ, మ్యాక్స్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు.74 పరుగులతో అదరగొట్టిన అలెక్స్ క్యారీ(Alex Carey)కి 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.ఐదు వన్డేల సిరిస్‌లో ఆసీస్ 2-0 ఆధిక్యంతో నిలిచింది.మూడో వన్డే చెస్టర్-లీ-స్ట్రీట్(Chester-le-Street) వేదికగా శనివారం జరగనుంది.