IND Vs BAN: అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రతిభ.. తొలి టెస్ట్‌లో టీమిండియా బంపర్ విక్టరీ

బంగ్లాదేశ్‌ (Bangladesh)తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా టీమిండియా (Team India) శుభారంభం చేసింది.

Update: 2024-09-22 07:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌ (Bangladesh)తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా టీమిండియా (Team India) శుభారంభం చేసింది. చేపాక్ స్టేడియం (Chepak Stadium) వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 280 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అయితే, 515 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ (Bangalesh) జట్టు కేవలం 234 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో అదరగొట్టిన ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) చివరి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ మిడిలార్డర్‌ను పేకమేడలా కూల్చేసి ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో (Nazmul Hussain Santo) ఒక్కడే (82) పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో ర‌వీంద్ర జ‌డేజా (Ravindra Jadeja) 3 వికెట్లు, జ‌స్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఒక వికెట్ తీశారు. తొలి మ్యాచ్‌లో విజయంతో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా 1-0 అధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో టెస్టు కాన్పూర్ (Kanpur) వేదిక‌గా సెప్టెంబ‌ర్ 27న నుంచి ప్రారంభం కానుంది.

అదరగొట్టిన అశ్విన్, జడేజా

కాగా, మొదట టాస్ నెగ్గిన బంగ్లా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. బంగ్లా స్పిన్నర్ హసన్ మహమూద్ ధాటికి టీమిండియా 144 పరుగులకే 6 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (Ravichandra Ashwin) 133 బంతుల్లో 113 పరుగులు చేసి జట్టను పటిష్ట స్థితిలో నిలిపాడు. మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 124 బంతుల్లో 84 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 376 ప‌రుగులకు ఆలౌట్ అయింది. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ (Bangladesh) భారత పేసర్ల ధాటికి 149 ప‌రుగుల‌కే కుప్పకూలింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ 227 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది.

సెంచరీలతో కదంతొక్కిన పంత్, గిల్

అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohith Sharma) (5), యశస్వీ జైస్వాల్ (Yashswi Jaiswal) (10) పరుగులు చేసి అవుటయ్యారు. విరాట్ కోహ్లీ (17) పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన కీపర్ రిష‌బ్ పంత్ (109), శుభ్‌మ‌న్ గిల్ (119) సెంచరీలతో కదంతొక్కడంతో 287 పరుగుల వద్ద భార‌త్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అదేవిధంగా 515 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందుంచింది. అయితే, అశ్విన్ (Ashwin) స్పిన్ మాయాజాలానికి తట్టుకోలేక బంగ్లా బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవీలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆ జట్టు 234 పరుగులకే ఆలౌటవ్వడంతో భారత్ విజయం ఖరారైంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో పాటు చివరి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లోనూ అదగొట్టిన అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.


Similar News